- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రైతులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక ప్రకటన
రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులకు శుభవార్త అందింది

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో తోతాపురి మామిడి రైతులకు శుభవార్త అందింది. ఏపీ(Andhra Pradesh) సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇటీవల కుప్పం పర్యటనకు వెళ్లిన సీఎం.. మామిడి రైతుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన అడుగులు వేశారు. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వనుంది. ఇప్పటివరకు సేకరించిన మామిడికి కిలోకు రూ.4 చొప్పున సబ్సిడీ ఇస్తారు.
ఈ సబ్సిడీ మొత్తం రూ.150 కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తామని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో క్వింటా మామిడికి మద్దతు ధర రూ.1,490గా నిర్ణయిస్తూ కేంద్రం నుంచి తాజాగా ప్రకటన వెలువడింది. ఈ తరుణంలో 50:50 నిష్పత్తిలో కేంద్రం, ఏపీ ప్రభుత్వం(AP Government) మద్దతు ధర చెల్లించనున్నాయి. నేరుగా రైతుల బ్యాంకు ఖాతా(Bank Account)ల్లో నగదు జమ కానుంది. తాజా నిర్ణయం పై తోతాపురి రైతులు హర్షం వ్యక్తం చేస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, వారి సమస్యలకు పరిష్కారం చూపిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan kalyan)కు కృతజ్ఞతలు తెలిపారు.






