- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారికి గుడ్ న్యూస్.. మంత్రి నారాయణ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తుందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇవాళ(శుక్రవారం) ప్రకాశం జిల్లా పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని మంత్రి విమర్శించారు. ఈ క్రమంలో గత ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సంక్షేమానికి రాష్ట్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి నారాయణ వెల్లడించారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం అని తెలిపారు.
ఈ తరుణంలో టిడ్కో ఇళ్ల పై లబ్దిదారులకు మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు. టిడ్కో లబ్ధిదారులకు దీపావళి నాటికి టిడ్కో ఇళ్లు అందజేస్తామని పేర్కొన్నారు. మున్సిపాలిటీ, పట్టణ అభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అయితే.. ఇప్పటికే టిడ్కో ద్వారా నిర్మించిన ఇళ్లను అప్పగించే పనులను వేగవంతం చేసేందుకు సహకరించాలని బ్యాంకర్లను మంత్రి నారాయణ కోరిన విషయం తెలిసిందే.






