- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News : నిరుద్యోగులకు శుభవార్త
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ ప్రభుత్వం

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ తెలిపింది ఏపీ ప్రభుత్వం(AP Govt). ఏపీపీఎస్సీ(APPSC) ఉద్యోగాలకు వయోపరిమితి పెంచుతూ(Age Limit Increase) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీపీఎస్సీతో పాటు పలు ఏజెన్సీలు నిర్వహించే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచింది. యూనిఫాం ఉన్న సర్వీసెస్‌కు రెండేళ్ల వయోపరిమితి పెంచగా.. యూనిఫాం లేని ఉద్యోగాలకు వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ వయోపరిమితి కొద్ది నెలలకు మాత్రమే పరిమితం చేసింది. రానున్న సెప్టెంబర్ 30లోపు జరిగే అన్ని పరీక్షలకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తించనుంది. అనంతరం జరిగే నియమాకాలకు పూర్వపు వయోపరిమితి వర్తించనుంది. కాగా త్వరలోనే ఏపీలో మెగా డీఎస్సీతోపాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా.. ఇపుడు వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగా.. ఎన్నికల కమిషన్ ఎలెక్షన్ కోడ్ ఎత్తివేసింది. మరికొద్ది రోజుల్లోనే ఉద్యోగ నియమాకాలకు నోటిఫికేషన్స్ వెలువడే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.






