- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలోని క్రీడాకారులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) క్రీడాకారుల ప్రయోజనాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రంలోని క్రీడాకారులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్స్ కోటాను ప్రభుత్వం రెండు నుంచి మూడు శాతానికి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్(K. Vijayanand) నిన్న(శనివారం) ఉత్తర్వులను విడుదల చేశారు.
మొత్తం 65 క్రీడాల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని తెలిపారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగం సంస్థలు, పోలీస్, ఎక్సైజ్, అటవీ శాఖల్లో హరిజెంటల్‌గా రిజర్వేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతిభావంతులైన క్రీడాకారులను APPSC, సెలక్షన్ బోర్డులు నిర్వహించే పరీక్షలతో సంబంధం లేకుండా రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించిన తుది మెరిట్ ఆధారంగా నియమిస్తాయని స్పష్టం చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తే.. పరీక్షలు లేకుండానే నియామకాలు చేపడతారని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ(Mega DSC)లోనూ ఒక శాతం అదనంగా ఉద్యోగాలు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.






