- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Deputy CM:ఏజెన్సీ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన
రాష్ట్రం(Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ శుభవార్త చెప్పారు.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లోని ఏజెన్సీ ప్రాంత ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ శుభవార్త చెప్పారు. ఇకపై ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు డోలి కష్టాలు ఉండబోవని.. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ తరుణంలో తర్వలోనే ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణాలు చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతల గురించి వివరించగానే పెద్ద మనసుతో సీఎం చంద్రబాబు స్పందించి రూ.50 కోట్లు విడుదల చేయించారని కొనియాడారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదిలా ఉంటే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు గిరిజన గ్రామాల్లో సందర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారితో మాట్లాడి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కష్టాలు తెలుసుకొని పవన్ కల్యాణ్ చలించిపోయారు. పవన్ కల్యాణ్ వెంటనే ఆయా గ్రామాలకు పంచాయతీ రాజ్ మంత్రి హోదాలో పలు గ్రామాలకు యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. అలాగే, ఏజెన్సీలోని పలు గ్రామాల్లో మొత్తం 222 కుటుంబాలకు ఒక్కో ఇంటికి మూడు రగ్గులు చొప్పున పంపిణీ చేశారు. దీంతో వారు ఆనందం వ్యక్తం చేశారు.






