మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

by Jakkula.Mamatha |

జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

మంగళగిరి ప్రజలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
X

దిశ,డైనమిక్ బ్యూరో: జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు మనల్ని మార్చివేస్తాయని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 2019లో నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయాను అన్నారు. నేను వచ్చిన 20 రోజుల్లో ఎన్నికలు జరిగాయి అని తెలిపారు. 5300.ఓట్ల తేడాతో ఆనాడు నేను ఓడిపోయాను.. ఆరోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచిందన్నారు. ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మంగళగిరి ప్రజల కోసం పనిచేశారు అన్నారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు సర్వే చేశామన్నారు. మంగళగిరి, కుప్పం సర్వేలు పక్క పక్కన పెడితే మంగళగిరి వెనుక ఉన్నట్లు తెలిసిందన్నారు. అయినా మీ కంటే ఒక ఓటు అయినా ఎక్కువ వస్తుందని చంద్రబాబుకు తాను చెప్పానన్నారు. ఈ విధంగా తాను భారీ మెజారిటీతో గెలిచి చూపించానని అన్నారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని పని చేస్తానని చెప్పారు. తాను ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెలలోనే శంకుస్థాపన చేసి ఏడాదిలోగా జరిగిన పూర్తి చేస్తామన్నారు. ఓటమి ప్రభుత్వంలో కలిసికట్టుగా ప్రజలకు సేవ చేస్తామని మాటిచ్చారు. మూడు విడతలుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. దాదాపు వెయ్యి కోట్ల విలువైన ఆస్తిని మీకు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.

Next Story