మసాల్చీలకు గుడ్ న్యూస్.. మంత్రి ఫరూఖ్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న మసాల్చీ (Masalchi)లకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది.

మసాల్చీలకు గుడ్ న్యూస్.. మంత్రి ఫరూఖ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న మసాల్చీ (Masalchi)లకు కూటమి సర్కార్ తీపికబురు చెప్పింది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న దినసరి వేతనం రూ.300 నుంచి 570కి పెంచుతున్నట్లుగా చట్టం, న్యాయ మంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ (Minister NMD Farooq) వెల్లడించారు. కోర్టుల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడం, చిన్న చిన్న సహాయక పనులు చేసేవారు (మసాల్చీలుగా) దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లుగా ఆయన పేర్కొన్నారు. వారి దినసరి వేతనాన్ని పెంచడమే కాకుండా వేతనాన్ని నెలలో 26 రోజుల వరకు వర్తింపజేస్తున్నామని తెలిపారు. మసాల్చీలు ఇక నుంచి నెలకు దాదాపు రూ.14,820 వరకు వేతనం పొందుతారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న తాజాగా నిర్ణయంపై రాష్ట్రంలోని మసాల్చీలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story