- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగులకు తీపికబురు.. ఆర్టీసీ బస్సుల్లో ఇక ఉచిత ప్రయాణం
ఏపీ ప్రభుత్వం దివ్యాంగుల కోసం 'ఇంద్రధనుస్సు' పథకాన్ని ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 18 నుంచి ఆర్టీసీ బస్సుల్లో వారందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంద్రధనుస్సు’ (Indradhanassu) పథకంలో భాగంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లుగా ఏపీఎస్ ఆర్టీసీ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘ఇంద్రధనుస్సు’ పథకం ద్వారా రవాణా భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది.
దివ్యాంగుల సాధికారతకు పెద్దపీట వేస్తూ, వారి సామాజిక, ఆర్థిక పురోగతికి అండగా నిలవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంద్రధనుస్సు పథకం కింద అర్హులైన దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణ వెసులుబాటు కల్పించనున్నారు. అయితే, ప్రయాణ సమయంలో దివ్యాంగులు తమ వెంట ఉండాల్సిన గుర్తింపు కార్డులు (SADAREM Certificate/RTC Pass) ఇతర విధివిధానాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఏపీఎస్ ఆర్టీసీ త్వరలోనే వెల్లడించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల దివ్యాంగుల సంఘాలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






