పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-07 11:45:06  IST  )

ఆంధ్రపదేశ్‌(Andhra Pradesh)లో పదో తరగతి(Tenth Class) విద్యార్థుల(Students)కు ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రపదేశ్‌(Andhra Pradesh)లో పదో తరగతి(Tenth Class) విద్యార్థుల(Students)కు ఏపీఎస్‌ఆర్టీసీ(APSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఈ నెల(మార్చి) 17వ తేదీ నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ(RTC) యాజమాన్యం సిబ్బందికి పలు కీలక సూచనలు చేసింది. టెన్త్ విద్యార్థుల వద్ద బస్ పాస్ లేకపోయినా హాల్‌టికెట్(Hall Ticket) చూసి పల్లె వెలుగు/ అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కించుకోవాలని ఆదేశించింది. పబ్లిక్ హాలిడే(Public Holiday) రోజుల్లోనూ పరీక్షలు(Exams) ఉంటే అనుమతించాలని పేర్కొంది. ఈ నెల 17 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు వాట్సాప్‌ ద్వారా విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

Next Story