- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Government: పదో తరగతి, ఇంటర్మీడియట్ టాపర్లకు గుడ్ న్యూస్
రాష్ట్రం(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ(Education System) పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థ(Education System) పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియట్(Intermediate)లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరిట ప్రభుత్వం(AP Government) అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఉత్తమ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులను ఇవ్వాలని ఇటీవల కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ తరుణంలో ఇవాళ(సోమవారం) టెన్త్(10th), ఇంటర్(Inter) పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను 'షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ - 2025' పేరిట ప్రభుత్వం సత్కరించనుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ క్రమంలో మన్యం జిల్లా పార్వతీపురంలో జరిగే ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) హాజరవుతారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలో టాపర్లుగా నిలిచిన 4,168 మంది, ఇంటర్మీడియట్‌లో 920 మందికి ఈ అవార్డులు అందజేయనున్నారు. ఈ క్రమంలో వారికి రూ.20 వేల నగదు బహుమతి, మెడల్, సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. టెన్త్ విద్యార్థులకు, ప్రభుత్వ, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కళాశాలల్లో MPC, BiPC, HEC, CEC, MEC, ఒకేషనల్ విభాగాల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.






