- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TDP కార్యకర్తలకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించడానికి తలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్‌కు మంత్రి లోకేష్ నారా భువనేశ్వరితో కలిసి భూమి పూజ చేశారు.

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ బీచ్ రోడ్డులో తాజ్ వరుణ్ గ్రూప్ ఆధ్వర్యంలో వరుణ్ బే శాండ్స్ పేరిట నూతనంగా నిర్మించడానికి తలపెట్టిన కొత్త అత్యాధునిక హోటల్, ఆఫీస్ టవర్‌కు మంత్రి లోకేష్ నారా భువనేశ్వరితో కలిసి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. అనంతరం యలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఉత్తమ కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలకు కూడా ఉపాధి కల్పించాలని సీఎం చంద్రబాబు(CM Chandrababu) నిత్యం అంటారని తెలిపారు. ఈ క్రమంలో మూడున్నర దశాబ్దాల క్రితం హెరిటేజ్ అనే విత్తనం నాటారని తెలిపారు. ఈ క్రమంలో పార్టీలో చాలామంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యకర్తలే టీడీపీ అధినేతలు అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ కార్యకర్తలను మంత్రి లోకేష్(Minister Lokesh) అభినందించారు. ఈ క్రమంలో మంత్రి కార్యకర్తలకు శుభవార్త చెప్పారు.
కార్యకర్తలకు ప్రమాద బీమా మరింత పెంచుతున్నామని పేర్కొన్నారు. మా ఖర్చులకోసం రాజకీయాలలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ధర్మం అందరూ పాటించాలన్నారు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నారు. పార్టీలో తిట్టుకుందాం కొట్టుకుందాం.. కానీ విడాకులు మాత్రం వద్దన్నారు. మా చుట్టూ మీరు తిరిగితే పదవులు రావన్నారు. మీ సభ్యత్వం నెంబర్ కొడితే మీ చరిత్ర అంతా వస్తుందన్నారు. ఎవరు సభ్యత్వం బాగా చేశారు, ఎవరి బూత్ లో ఎంత మెజార్టీ వచ్చింది. అన్ని తెలుస్తాయన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. టీడీపీ(TDP) కార్యకర్తలు కేడర్ కార్యాలయాలకు వెళ్లి చట్టపరంగా పరిష్కరించాల్సిన సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని తెలిపారు.
మే నెల నుంచి ప్రతిరోజూ 300 మందికి చొప్పున పార్టీ కేడర్ కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తాం అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చి 10 నెలలు అయింది. మరో రెండు నెలల్లో మహానాడు నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చట్టపరిధిలోని పనుల కోసం కార్యకర్తలు కార్యాలయాలకు వెళితే పనులు చేయాల్సిందే. ఓర్పు, సహనంతో ప్రజల్లోకి వెళ్లాలని మంత్రి లోకేష్ కార్యకర్తలను కోరారు.
Read Mlore..
‘ఇలాంటి సినిమాలు ఏ జనరేషన్‌కు అయిన నచ్చుతాయ్’.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్






