- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Govt:టెన్త్, ఇంటర్ పాసైన విద్యార్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరిట ప్రభుత్వం అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ క్రమంలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేటు ఉత్తమ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులను ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ తరుణంలో పదో తరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం పైగా మార్కులు సాధించిన వారికి ఈ అవార్డు అందజేయనుంది. ప్రతి మండలంలో ఆరుగురు పదో తరగతి విద్యార్థులు ఇద్దరు OC, ఇద్దరు BC, ఒక్కరు SC, ఒక్కరు STవిద్యా ర్థులను ఎంపిక చేస్తారు. ఇక ప్రతి జిల్లాలో 36 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఈ నేపథ్యంలో ఇంటర్ లో 830, ఆపైన మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థులకు సర్టిఫికెట్, మెడల్, రూ.20,000 నగదు కూడా ఇస్తారు. ఈ క్రమంలో అవార్డులు ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించేందుకు అవార్డులు ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది.






