- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nara Lokesh:విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక నిర్ణయం
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్ర అభివృద్ధే(State Development) లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) విద్య వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థ(Education System)ను నాశనం చేసిందని ఇటీవల మంత్రి లోకేష్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో ఏపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్(Model School) ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.
ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో భాగంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్(Learning Excellence in Andhra Pradesh Programme) అమలుకు చేపట్టాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ మేరకు పాఠశాల విద్య, ఇంటర్మీడియట్(Intermediate), ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్, జీవో 117కు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై రేపు(సోమవారం) శాసనసభ్యులతో వర్క్ షాప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉన్నత విద్యలో మార్పులు, NIRF ర్యాంకింగ్స్ మెరుగుదల తదితర అంశాలపై చర్చించేందుకు గవర్నర్ నేతృత్వంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌తో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్(Post Graduation) ఫీజు రీయంబర్స్‌మెంట్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలన్నారు.






