- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మధ్యాహ్న భోజన మెనూలో కీలక మార్పులు
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్యా వ్యవస్థ(Education System) పై ప్రత్యేక దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అమలు అవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని(Mid-day meal scheme) అమలు చేపట్టింది. ప్రస్తుతం ఈ పథకానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సూచనల మేరకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ పథకం పై మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మధ్యాహ్నం భోజన పథకం(Mid-day meal scheme)లో భాగంగా విద్యార్థులకు ఇకపై సన్నబియ్యం అందించాలని ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు. ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ పై మంత్రివర్గం చర్చించగా.. మెనూలో తీసుకొచ్చిన మార్పులకు మంత్రి లోకేష్ వివరించారు. ప్రాంతాల వారీగా పిల్లలు ఇష్టపడి తినే ఆహారాలను మెనూలో పెట్టనున్నట్లు చెప్పారు. మంత్రి లోకేష్ చేసిన సన్నబియ్యం ప్రతిపాదనకు మంత్రి నాదెండ్ల మనోహర్(Minister Nadendla Manohar) సహా ఇతర మంత్రులు అంగీకారం తెలిపారు.






