- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన విషయం తెలిసిందే. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్నక్యాంటీన్ల పునఃప్రారంభం, ల్యాండ్ టైట్లింగ్ యాక్టు రద్దు, మెగా డీఎస్సీ, ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి హామీలను నెరవేర్చి శభాష్ అనిపించుకున్నారు. ఈ తరుణంలో మిగిలిన హామీలను కూడా దశలవారీగా అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ(Andhra Pradesh)లోని ప్రభుత్వ స్కూళ్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ స్కూళ్ల(Govt School)లో చదివే విద్యార్థు(Student)ల్లో నైపుణ్యాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను విజ్ఞాన, విహార యాత్రకు తీసుకెళ్లనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్ర పరిధిలో ఒక్కో స్టూడెంట్‌కు రూ.200, ఇతర రాష్ట్రాలకు రూ.2K చొప్పున ఖర్చు చేస్తామంది. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపిక పై సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.






