Srisailam:శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..!

by Jakkula.Mamatha |

శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Shri Bhramarambika Mallikarjuna Swami) వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

Srisailam:శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్..!
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Shri Bhramarambika Mallikarjuna Swami) వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో తాజాగా శ్రీశైలం(Srisailam) మల్లన్న భక్తులకు దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీశైలం మల్లన్న స్వామి వారి దర్శనం వేళల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం వెళ్లే భక్తులకు(Devotees) ఆలయ అధికారులు స్వామి వారి స్పర్శ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఈ క్రమంలో పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో.. వారంతరాల్లో మాత్రం స్పర్శ దర్శనానికి అనుమతినివ్వరు. భక్తుల రద్దీ(Crowd of devotees) నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా స్వామి వారి స్పర్శ దర్శనం పై నూతన ఈవో(New EO) ఎం.శ్రీనివాసరావు(M. Srinivasa Rao) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎప్పుడు కూడా స్వామి వారి స్పర్శ దర్శనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నూతన ఈవో నిన్న(సోమవారం) మారిన వేళలను మీడియాతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో గతంలో శని, ఆది, సోమవారాలు పర్వదినాలలో భక్తుల రద్దీ దృష్ట్యా స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలివేస్తూ దేవస్థానం ప్రకటించింది. అయితే స్పర్శ దర్శనాలు కల్పించాలని తరచూ భక్తులు వినతి చేయడంతో.. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి స్పర్శ దర్శనానికి వెసులుబాటు కల్పించారు.

Next Story