Govt School:స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి!

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-12 03:17:09  IST  )

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో(Govt School) చదివే విద్యార్థుల(Students)కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Govt School:స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో(Govt School) చదివే విద్యార్థుల(Students)కు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి విద్యార్థులకు కొత్త యూనిఫామ్‌లు అందించాలని ఏపీ ప్రభుత్వం(AP Government) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ(Andhra Pradesh)లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫాం(Uniform) మారుస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) అసెంబ్లీ(Assembly) వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఆమోదం కూడా తెలిపారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. సెమిస్టర్ వారీగా పుస్తకాలు ఇస్తామని, ఒకటో తరగతికి రెండు పుస్తకాలే(Books) ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించామని, టీచర్లకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. స్కూల్ విద్యార్థులు యూనిఫామ్ కుట్టే కూలీని కూడా ప్రభుత్వం ఖరారు చేసింది. ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులకు రూ.120, తొమ్మిది, పదో తరగతుల వారికి రూ.240 చెల్లించనున్నారు.

మరోవైపు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరుతో కూటమి సర్కార్ విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయనుంది. ఈ కిట్‌లో యూనిఫామ్, బెల్టులు, బ్యాగ్‌(School Bag)లు అందించనున్నారు. అలాగే.. బెల్టులపై గతంలో విద్యా కానుక అని రాయగా.. ఈసారి ప్రత్యేకంగా రూపొందించిన లోగోను ముద్రించనున్నట్లు తెలుస్తోంది. ఇంకా పిల్లల స్కూల్ బ్యాగులు లేత ఆకుపచ్చ రంగులో ఉండనున్నాయి. ఈ కిట్లను పాఠశాలలు(Schools) తెరిచే రోజు(జూన్‌ 12) విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Next Story