- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైస్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. రాగులు, గోధుమ పిండి పంపిణీపై మంత్రి నాదెండ్ల కీలక వ్యాఖ్యలు
ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. రేషన్ సరఫరాలో నూతన సంస్కరణలు ప్రవేశపెడుతోంది. పేదలకు ఉచితంగా బియ్యంతో పాటు అనేక నిత్యావసర సరుకులు అందిస్తోంది. అందులో భాగంగా తాజాగా ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి రైస్ కార్డుదారులందరికీ రాగులు, గోధుమ పిండి పంపిణీ చేస్తామని తెలిపారు. దీనికి తగిన సహకారం అందిస్తామని కేంద్ర తెలిపిందని అన్నారు. పౌష్టిక ఆహారంలో ఇది ఒక మెరుగైన పరిస్థితి అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో ఆహారంలో న్యూట్రీషన్ వ్యాల్యూ పెంచుకునే విధంగా మనలో మార్పలు తీసుకురావాలని ఆయన ఎప్పుడూ ప్రస్తావిస్తుంటారని వెల్లడించారు. అందులో భాగంగానే రాగులు, గోధుమ పిండి ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే చక్కెర, బియ్యంతో 29,752 షాపుల్లో జనవరి 1 నుంచి ఇవి కూడా అందిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పౌరసరఫరాల శాఖకు సంబంధించి ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి వివరించినట్లు తెలిపారు. పీడీఎస్ బియ్యం సరఫరాలో క్యూఆర్ కోడ్ విధానం అమలు చేసి.. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని తెలిపారు.






