రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

by Jakkula.Mamatha |

రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

రేషన్‌కార్డు దారులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు
X

దిశ,వెబ్‌డెస్క్: రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుదారులకు e-KYC ప్రక్రియను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నకిలీ రేషన్ కార్డులు అరికట్టడం, అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సాయం అందించడం కోసం ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ–కేవైసీ ప్రక్రియను ఈ నెల(మార్చి) 31 నాటికి పూర్తి చేయాలని ప్రకటించింది.

ఈ గడువు తర్వాత e-KYC పూర్తి చేయని వారు రేషన్ సబ్సిడీ ప్రయోజనాలను పొందలేరు. ఈ తరుణంలో రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఈ-కేవైసీ చేయించుకునే గడువును అధికారులు పొడిగించారు. ఈ నెల 31తో గడువు ముగియనుండగా దాన్ని ఏప్రిల్ 30 వరకు పెంచారు. దీంతో ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచనలు జారీ చేశారు. అయితే మరోసారి ఈ గడువు పెంచే అవకాశం ఉండకపోవచ్చు అని అధికారులు తెలిపారు.

Next Story