రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఈ ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లు

by Ajay Maddhiboyina |

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప‌లు ప్రాంతాల‌కు 48 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఈ ప్రాంతాలకు 48 ప్రత్యేక రైళ్లు
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప‌లు ప్రాంతాల‌కు 48 ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డుపుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ నెల 9వ తేదీ నుండి 25వ తేదీ వ‌ర‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. తిరుప‌తి హిసార్ మ‌ధ్య బుధ‌, ఆదివారాల్లో 12 ప్ర‌త్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని తెలిపింది. అదే విధంగా కాచిగూడ తిరుప‌తి మ‌ధ్య గురు, శుక్ర‌వారాల్లో 8 ప్ర‌త్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని పేర్కొంది. న‌ర‌సాపూర్- తిరువ‌ణ్ణ‌మ‌లై మ‌ధ్య బుధ గురు వారాల్లో 16 ప్ర‌త్యేక రైళ్లు న‌డుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది. వీటిలో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం కూడా క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొంది. రైళ్ల వివ‌రాల‌ను సౌత్ సెంట్ర‌ల్ రైల్వే అధికారిక వెబ్ సైట్లో ఉంచిన‌ట్టు తెలిపారు.

Next Story