Nara Lokesh: ప్రైవేట్ స్కూళ్లకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-02-03 15:28:00  IST  )

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ(Education System) పై ఐటీ, విద్యా శాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) ప్రత్యేక దృష్టి పెట్టారు.

Nara Lokesh: ప్రైవేట్ స్కూళ్లకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విద్యా వ్యవస్థ(Education System) పై ఐటీ, విద్యా శాఖ మంత్రి(Education Minister) నారా లోకేష్(Nara Lokesh) ప్రత్యేక దృష్టి పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఎడ్యుకేషన్ సిస్టం పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని రంగాల్లో అభివృద్ధి పై ఫోకస్ పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రైవేటు స్కూళ్లకు విద్యా శాఖ మంత్రి లోకేష్ శుభవార్త చెప్పారు. నేడు(సోమవారం) ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కరిక్యులమ్‌లో మార్పులు, నైతిక విలువలు(Moral Values) పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం అన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల(Private School) గుర్తింపు గడువును పది సంవత్సరాలకు(10 Years) పెంచుతామని వెల్లడించారు. అదే విధంగా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ‘పోటీ పడదాం.. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం’ అని మంత్రి లోకేష్(Minister Lokesh) పిలుపునిచ్చారు.


Also Read..

Holiday: విద్యార్థులకు ఎగిరిగంతేసే శుభవార్త.. ఆ రోజు స్కూళ్లకు సెలవు

Next Story