రోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు

by Muthe.Rajitha |

ఏపీలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.

రోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవల కోసం 24 ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్(CCB)లు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. పీఎం ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ₹600 కోట్లతో వీటిని ఏర్పాటుచేస్తున్నారు. వీటి పురోగతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ బుధవారం సమీక్షించారు.

24 క్రిటికల్ కేర్ బ్లాకుల్లో 13 వచ్చే నెలాఖరుకు, మిగతావి 2026 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా ఏపీలో కోవిడ్ అత్యవసర వైద్యానికి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటి ఘటనలో మళ్లీ పునరావృతం కాకుండా కేంద్రప్రభుత్వం దేశంలో వివిధ రాష్ట్రాల్లో 621 CCBలను నెలకొల్పుతోంది. వీటిలో ఏపీకి 24 కేటాయించబడ్డాయి.

Next Story