మెడికల్ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

మెడికల్ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్‌ గ్రౌండ్స్‌పై అన్‌ఫిట్‌గా ప్రకటించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత మెడికల్‌ అన్‌ఫిట్‌గా గుర్తించిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి ఉద్యోగులను ప్రభుత్వంలోని ఇతర శాఖలు లేదా సంస్థల్లో వారికి సరిపడే పోస్టుల్లో అడ్జస్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వందలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై RTC అన్‌ఫిట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story