- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లేపాక్షి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెంచిన ప్రభుత్వం
రాష్ట్రంలో లేపాక్షి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో లేపాక్షి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. ఏపీలో ఉన్న లేపాక్షి షోరూముల్లో కొంతకాలంగా అమ్మకాలు గణనీయంగా పెరగడంతో.. ఉద్యోగులకు కష్టాన్ని గుర్తించి బొనాంజా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగులు అందుకుంటోన్న జీతంపై 10 శాతం వేతనాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హస్తకళాకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలిపారు. సంస్థ ప్రగతిలో భాగస్వాములైన ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. లేపాక్షి ఉద్యోగుల జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి సవితకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లేపాక్షి ప్రగతికి మరింత కష్టపడి పనిచేస్తామని వారు పేర్కొన్నారు.






