హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ చార్జీల పెంపు..!

by Vemula.Srinu Prasad |

హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది..

హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ చార్జీల పెంపు..!
X

దిశ, వెబ్ డెస్క్: హాస్టల్ విద్యార్థుల(Hostel Students)కు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని(Food) అందించేందుకు కూటమి ప్రభుత్వం(Kutami Government) అడుగులు వేసింది. ఈ మేరకు వారికి సంబంధించిన డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. 10 నుంచి 15 శాతం పెంచేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం తరగతులను బట్టి హాస్టల్ విద్యార్థులకు రూ. 1500 నుంచి 1600 వరకు ఇస్తోంది. దీనికి అదనంగా మరో 10 నుంచి 15 శాతం పెంచాలని యోచిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం రూ. 100 నుంచి 148 కోట్ల మేర భారం పడే అవకాశం ఉంది. ఈ పెంపు నుంచి ఈ నెల లేదా వచ్చే నెల నుంచి పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటన చేసి ఉత్తర్వులు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి.

Next Story