హోంగార్డులకు గుడ్ న్యూస్.. రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా

by Vemula.Srinu Prasad |

హోంగార్డులకు ఏపీ హోంశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వారికి రూ. 3 లక్షల రూ. 33 లక్షల వరకూ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించింది. ఈ మేరకు విశాఖలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని సైతం ప్రారంభించింది. ..

హోంగార్డులకు గుడ్ న్యూస్.. రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా
X

దిశ, వెబ్ డెస్క్: హోంగార్డులకు ఏపీ హోంశాఖ గుడ్ న్యూస్ తెలిపింది. వారికి రూ. 3 లక్షల రూ. 33 లక్షల వరకూ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించింది. ఈ మేరకు విశాఖలో హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని సైతం ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రారంభించారు. హోంగార్డుల ఆరోగ్య భద్రతపై దేశంలోనే తొలిసారిగా ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఈ పథకం ద్వారా మొత్తం 3,140 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని కల్పించనున్నారు. అయితే తొలి విడుతగా మొత్తం 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమాను అందించనున్నారు. ఈ బీమా పథకం కింద భర్త, భార్య, ఇద్దరు పిల్లల వరకు కవరేజ్ ఇస్తున్నారు. పోలీసు వారికి వర్తించే ఆరోగ్య భద్రత వీరికి వర్తించకపోవడం, వేతనాలు సైతం తక్కువగా ఉండటంతో ప్రభుత్వం, రాష్ట్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

హోంమంత్రి అనిత ట్వీట్...

Next Story