మత్య్సకారులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 20 వేలు

by Vemula.Srinu Prasad |

మాట తప్పని ప్రజా ప్రభుత్వమని, మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట గ్రామం నుంచి మత్య్సకారుల ఖాతాల్లోకి రూ. 20 వేలు చొప్పున సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు...

మత్య్సకారులకు శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 20 వేలు
X

దిశ, వెబ్ డెస్క్: మాట తప్పని ప్రజా ప్రభుత్వమని, మత్స్యకార సోదరులకు అండగా నిలుస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) అన్నారు. నెల్లూరు జిల్లా తుమ్మలపెంట గ్రామం(Tummalapenta Village) నుంచి మత్య్సకారుల(Fishermen) ఖాతాల్లోకి రూ. 20 వేలు చొప్పున సీఎం చంద్రబాబు(Cm Chandrababu) జమ చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు.

గంగపుత్రుల ఇళ్లల్లో పొయ్యి వెలగాలి..

‘‘వేటకు విరామం ఉన్న సమయంలో మన గంగపుత్రుల ఇళ్లల్లో పొయ్యి వెలగాలి. వారి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి రూ.20 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం. వరుసగా రెండో ఏడాది కూడా అత్యంత పారదర్శకంగా, లబ్ధిదారుల సంఖ్యను పెంచాం. మొత్తం 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల నిధులను మంగళవారం నెల్లూరు జిల్లా కావలి పరిధిలోని తుమ్మలపెంట గ్రామంలో జరిగే బహిరంగ సభలో లబ్దిదారుల ఖాతాల్లోకి ముఖ్యమంత్రి చంద్రబాబు జమ చేయనున్నారు. గత పాలకులు మత్స్యకారులను విస్మరించి అరకొర సాయంతో కాలక్షేపం చేస్తే... మన ప్రజా ప్రభుత్వం కేవలం ఈ రెండేళ్లలోనే రూ.505 కోట్ల భారీ సాయాన్ని వేట నిషేధ భృతిగా అందించింది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకార కుటుంబాలకు సకాలంలో పరిహారం అందించడంతో పాటు, వారి ఆదాయాలు పెంచేందుకు సీవీడ్ సాగును సైతం ప్రోత్సహిస్తున్నాం.’’ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Next Story