గోదావరి, కృష్ణా డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. సాగు నీరు విడుదలపై కీలక అప్‌డేట్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-18 11:03:25  IST  )

గోదావరి, కృష్ణా డెల్టా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 1 నుంచి సాగునీరు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది..

గోదావరి, కృష్ణా డెల్టా రైతులకు గుడ్ న్యూస్.. సాగు నీరు విడుదలపై కీలక అప్‌డేట్
X

దిశ, వెబ్ డెస్క్: గోదావరి(Godavari), కృష్ణా డెల్టా రైతుల(Krishna Delta Farmers)కు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. జూన్ 1 నుంచి సాగునీరు(Irrigation Water) విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సాగు నీటిపై అధికారులతో మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ జూన్ 1 నుంచి కాలువలకు నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రైతులు ఖరీఫ్‌కు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అలాగే కాలువల్లో పూడికతీత పనులు మే చివరి వారం వరకూ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు జులై చివరి వరకు, కేసీ కెనాల్‌కు జులై-15 నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. అలాగే వంశధార ఆయకట్టుకు జూన్-15 నుంచి సాగు నీరు విడుదల చేయనున్నట్లు మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.

Next Story