'మొంథా' తుఫాన్ బాధిత రైతుల‌కు గుడ్ న్యూస్‌..ఏపీ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న !

by velandi.Saikiran |

తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతును

మొంథా తుఫాన్ బాధిత రైతుల‌కు గుడ్ న్యూస్‌..ఏపీ మంత్రి కీల‌క ప్ర‌క‌ట‌న !
X

దిశ‌, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాలలో మొంథా తుఫాన్ ( Montha Cyclone ) ప్రళయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తుఫాన్ కారణంగా చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులకు పెద్దన్నగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం నిలుస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్.. బాపట్ల జిల్లాలో పర్యటించారు. వరద ప్రభావాన్ని అంచనా వేశారు. అన్నంబొట్లవారిపాలెం, పర్చూరు ప్రాంతాల్లో పొంగుతున్న వాగులను కూడా పరిశీలించారు మంత్రి గొట్టిపాటి. ఈ సందర్భంగా నిల్వగా ఉంచిన పొగాకు పరిశీలన చేశారు.

అనంతరం ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. తుఫాన్ కారణంగా ఏపీలో భారీగా నష్టం జరిగిందని పేర్కొన్నారు. మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లా వరకు వాగుల ఉధృతి కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోయాయని గుర్తు చేశారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఏపీ మంత్రి గొట్టిపాటి. అలాగే 24 గంటల్లోనే విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ పనులను చేస్తామని ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రంలోగా వ్యవసాయ కనెక్షన్స్ కూడా పునరుద్ధరిస్తామని వెల్లడించారు.

Next Story