- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నదాతలకు తీపికబురు.. రాష్ట్రానికి చేరిన 17,293 మెట్రిక్ టన్నుల యూరియా
తెలుగు రాష్ట్రాల్లోని రైతులను యూరియా (Urea) కొరత వేధిస్తోంది. వరుస వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలు పీఏసీఎస్ (PACS)ల ఎదుట యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లోని రైతులను యూరియా (Urea) కొరత వేధిస్తోంది. వరుస వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలు పీఏసీఎస్ (PACS)ల ఎదుట యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల ఓపిక నశించిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగుతూ.. వరసగా ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు కేంద్ర ప్రభుత్వం (Government Of India) గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టు (Kakinada Port)కు చేరింది.
ఈ మేరకు అక్కడి నుంచి యూరియా దిగుమతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను కూడా జారీ చేసింది. రాష్ట్రానికి యూరియా చేరడంతో వెంటనే అన్ని జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన యూరియాను పంపాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు (Minister Achennaidu) ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రికి అధికారులు తెలిపారు. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.






