- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ వినియోగదాలకు త్వరలో గుడ్ న్యూస్
విద్యుత్ వినియోగదాలకు త్వరలో గుడ్ న్యూస్ లభించనుంది...

దిశ, వెబ్ డెస్క్: ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి లేదా సరఫరాకు రూ.5.19 ఖర్చవుతున్నా, ప్రజలపై భారం పడకుండా 39 పైసలకు యూనిట్ ఖర్చు తగ్గించామని, త్వరలో మరో రూ.1.20 మేర కొనుగోలు భారాన్ని తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.32 వేల కోట్ల కరెంటు ఛార్జీలు పెంచి, లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆయన ఆరోపించారు. గత పాలకులు విధించిన రూ.4,600 కోట్ల డ్యూటీని ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కరెంటు ఛార్జీలు పెంచలేదని, ఇది సమర్థ నిర్వహణ వల్లే సాధ్యమైందని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు.
విద్యుత్ సరఫరా కోసం...
వైసీపీ పాలనలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసిన మంత్రి, ఇప్పుడు పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా ఇళ్లపైన, పొలాల్లో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని తెలిపారు. గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ ఇంధన ఉత్పత్తుల దిశగా కూడా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలన్నింటికీ కూడా క్రెడిట్ జగన్ కావాలని కోరుకోవడం వైసీపీ నాయకుల దివాళా కోరుతనానికి నిదర్శనమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు.






