- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala:శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రేపు ఆగస్టు నెల టికెట్లు విడుదల.. సమయం ఇదే!
తిరుమల శ్రీవేంకటేశ్వేర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు.

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీవేంకటేశ్వేర స్వామి వారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల(Tirumala) కొండకు చేరుకొని భక్తి శ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) భక్తుల(Devotees) కోసం ప్రతి నెలా ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవ, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను విడుదల చేస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి భక్తులకు ఆగస్టు నెల కోటా ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ రేపు(సోమవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
అలాగే ఈ-సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల(మే) 21న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మే 24న ఉదయం 10 గంటలకు ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను విడుదల చేయనుంది. జులై నెల శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవా టికెట్లు మే 29న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఈ మేరకు టీటీడీ(TTD) అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in/home/dashboard సందర్శించండి. వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.






