- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో వేసవి రద్దీ దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు(Devotees) రైల్వే శాఖ(Railway Department) శుభవార్త చెప్పింది. వేసవి కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని గమనించిన రైల్వే శాఖ.. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం- తిరుపతి(Machilipatnam-tirupati) మధ్య 14 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ నెల(ఏప్రిల్) 13 నుంచి మే 25వ తేదీ వరకు ప్రత్యేక రైలు(07121) తిరుపతిలో రాత్రి 10.20కి బయలుదేరుతుంది. ఉదయం 4.30కి విజయవాడ(Vijayawada)కు, 7.20కి మచిలీపట్నం చేరుకుంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 26 వరకు ఈ ప్రత్యేక రైలు (07122) తిరుగు ప్రయాణంలో మచిలీపట్నంలో సాయంత్రం 5.40కి బయలుదేరి తెల్లవారుజాము 3.20కి తిరుపతి(Tirupati) చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట(Renigunta), గూడూరు(Gudur), నెల్లూరు(Nellore), ఒంగోలు(Ongole), చీరాల(Chirala), తెనాలి(Tenali), గుడివాడ(Gudiwada), పెడన స్టేషన్‌లలో ఆగుతుందని రైల్వే అధికారులు(Railway officials) పేర్కొన్నారు.






