ఆక్వా రైతులకు గుడ్ న్యూస్

by Muthe.Rajitha |

ఏపీ ఆక్వా రైతులకు (Aqua Farmers) గుడ్ న్యూస్.

ఆక్వా రైతులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ఆక్వా రైతులకు (Aqua Farmers) గుడ్ న్యూస్. గత కొన్నేళ్లుగా తెల్లమచ్చ వైరస్ కారణంగా పొట్టు తీయని(Unpeeled) రొయ్యల ఎగుమతులపై ఆస్ట్రేలియా పరిమితులు విధించగా తాజాగా వాటిని ఎత్తివేసి ఎగుమతులకు అనుమతులిచ్చింది. కాగా ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) తన సోషల్ మీడియా ఖాతా X లో వెల్లడించారు. ఆక్వా రైతుల కోసం కృషిచేసిన ఇండియా, ఆస్ట్రేలియా(Australia) ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే రాబోయే ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు ఉత్పత్తులను కొత్త మార్కెట్లకు విస్తరించాల్సిన అవసరముందని ఇది నిరూపిస్తోందని నారా లోకేష్ పేర్కొన్నారు.

అయితే 2016 డిసెంబరులో ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో రొయ్యల్లో వైట్ స్పాట్ వైరస్(WSSV)ను గుర్తించిన తర్వాత 2017 జనవరి 6 నుంచి పొట్టు తీయని రొయ్యలు దిగుమతులపై పరిమితులు విధించింది అక్కడి ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పరిమితులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆక్వా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story