ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్...వారు ఫీజు కట్టక్కర్లేదు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-04-20 13:44:48  IST  )

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 16,347 పోస్టులకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్...వారు ఫీజు కట్టక్కర్లేదు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 16,347 పోస్టులకు పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష షెడ్యూల్, పోస్టుల సంఖ్య ఇతర వివరాలు అన్నీ వెబ్ సైట్‌లో పొందుపర్చారు. అయితే గతంలోనే డీఎస్సీ పోస్టులకు జగన్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం మారిన తరవాత ఆ పోస్టులను పెంచుతూ టీడీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే గతంలో అప్లై చేసుకున్న విద్యార్థుల్లో ఇప్పుడు గందరగోళం నెలకొంది. కానీ గతంలో అప్లై చేసుకున్నవారు ఇప్పుడు మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కేవలం అప్లికేషన్ నింపి సబ్మిట్ చేయాలని పేర్కొన్నారు.

Next Story