- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. ఈ జిల్లాలకు అలర్ట్ జారీ
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీకి 10.92 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అధికారులు175 గేట్లను ఎత్తి 10,01,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీకి 10.92 క్యూసెక్కుల నీరు వస్తుండగా.. అధికారులు175 గేట్లను ఎత్తి 10,01,410 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసి.. లంక గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ స్థాయిలో వరద నీరు వస్తుండటం, విడుదల చేస్తుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లోని నదీపరివాహక గ్రామాలకు వరద హెచ్చరికలు జారీ అయ్యాయి. ఏ క్షణానైనా వరదనీరు గ్రామాల్లోకి చేరవచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మరోవైపు భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం నది నీటిమట్టం 48 అడుగులుగా ఉండగా.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భద్రాచలం వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.






