- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో రేపు గోదా కల్యాణం
గోదా రంగనాథుల కల్యాణానికి సర్వం సిద్ధం.

దిశ, వెబ్ డెస్క్ : పవిత్రమైన ధనుర్మాసం ముగిసిన మరుసటి రోజైన జనవరి 15వ తేదీ గోదా కల్యాణం (Goda Devi Kalyanam) జరగనుంది. అత్యంత వైభవంగా వేడుకలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ప్రాంగణంలో గల మైదానంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం గురువారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుందని టీటీడీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఈ వేడుకను ప్రత్యక్ష ప్రసారం చేయనుందని పేర్కొంది. ఈ పవిత్ర కార్యక్రమంలో భాగంగా శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి, అర్చకస్వాములు శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాన్ని నిర్వహిస్తారని వెల్లడించింది.
అధికారులు మాట్లాడుతూ ఈ వేడుకలో భాగంగా ఆధ్యాత్మికతను పంచేలా ఎస్వీ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే 'గోదా కల్యాణం' నృత్యరూపకాన్ని ప్రదర్శించనున్నారని తెలిపారు. గోదాదేవి శ్రీరంగనాథునిపై పెంచుకున్న భక్తిని చాటిచెప్పే ఈ ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించనుందన్నారు. అనంతరం భక్తులందరూ కలిసి పాల్గొనే గోవిందనామ సంకీర్తనతో ఈ కార్యక్రమం మంగళప్రదంగా ముగుస్తుందని వెల్లడించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య కల్యాణాన్ని తిలకించి స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని టీటీడీ అధికారులు కోరారు. భక్తుల సౌకర్యార్థం మైదానంలో ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదం పంపిణీకి అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పర్యవేక్షిస్తోందని తెలియజేశారు.
READ MORE ....






