- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు అందరూ సొంతూళ్లకు చేరుకోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలకు అందరూ సొంతూళ్లకు చేరుకోవడంతో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి స్వల్పంగా తగ్గింది. బుధవారం ఉదయానికి ఉచిత దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. అలాగే టోకెన్లు పొందిన భక్తులకు సర్వదర్శనానికి 2-4 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 1-3 గంటల సమయం పడుతుంది. మంగళవారం 73,014 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 19,639 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.27 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
READ MORE ....
తిరుపతిలో రేపు గోదా కల్యాణం
Next Story






