TTD News:శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ

by Jakkula.Mamatha |

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి(Sri Kalyana Venkateswara Swamy) ఆలయంలో రెండో రోజైన మంగ‌ళ‌వారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి.

TTD News:శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి వైభవంగా పవిత్ర సమర్పణ
X

దిశ,వెబ్‌డెస్క్: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి(Sri Kalyana Venkateswara Swamy) ఆలయంలో రెండో రోజైన మంగ‌ళ‌వారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుక జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు ఆల‌యంలోని మూల‌వ‌ర్ల‌కు, ఉత్స‌వ‌ర్ల‌కు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో(Deputy EO) శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపీనాథ్, సూపరింటెండెంట్‌ శ్రీ రమేష్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Next Story