Minister Nimmala Ramanaidu:‘ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2024-12-08 12:56:50  IST  )

మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) వెల్లడించారు.

Minister Nimmala Ramanaidu:‘ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద’.. మంత్రి నిమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: మహిళలు, ఆడపిల్లల రక్షణే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) వెల్లడించారు. నేడు(ఆదివారం) మంత్రి నిమ్మల పశ్చిమ గోదావరి జిల్లాలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు బాధాకరమని, వీటిని అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ నేపథ్యంలో పాలకొల్లులో ఈ నెల 15న సేవ్ ది గర్ల్ చైల్డ్ పేరుతో 2 కే రన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం పై మంత్రి నిమ్మల విమర్శలు గుప్పించారు.

వైసీపీ పాలనలో ఇబ్బంది పడ్డ మహిళలందరికీ పెద్దన్నలా చంద్రబాబు(CM Chandrababu) అండగా ఉండి న్యాయం చేస్తున్నారని తెలిపారు. ఆడపిల్లలను రక్షించుకుందాం, భ్రూణ హత్యలు నిర్మూలిద్దాం, మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలను అరికడదాం అనే నినాదంతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఈ క్రమంలో “ఆడపిల్లలే జాతికి నిజమైన సంపద’’ ఆ సంపదను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలి అని సూచించారు. గత ఐదేళ్ల పాలనలో యువత గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈగల్ టీమ్ ద్వారా వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

Next Story