‘మా బిడ్డ క‌నిపించ‌డం లేదు.. పవనన్నా కాపాడు’.. ఎయిర్‌పోర్ట్ బయట త‌ల్లిదండ్రుల‌ నిర‌స‌న

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-26 11:07:27  IST  )

కాకినాడ జిల్లా కరప గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడింది ఓ మార్వాడి కుటుంబం. దాదాపు 18ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ నెల ఎనిమిదో తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె మిస్ అయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు

‘మా బిడ్డ క‌నిపించ‌డం లేదు.. పవనన్నా కాపాడు’.. ఎయిర్‌పోర్ట్ బయట త‌ల్లిదండ్రుల‌ నిర‌స‌న
X

దిశ, వెబ్‌సైట్ : కాకినాడ జిల్లా కరప గ్రామంలో వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడింది ఓ మార్వాడి కుటుంబం. దాదాపు 18ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. అయితే ఈ నెల ఎనిమిదో తారీఖున తమ పద్నాలుగేళ్ల కుమార్తె మిస్ అయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహాయం కోరుతూ ఎయిర్ పోర్టు బయట ప్లకార్డులను ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. ‘తమ బిడ్డ కనిపించడం లేదు.. తమకు ఇంకా న్యాయం జరగలేదు.. సాయం చేయన్నా’ అంటూ వేడుకున్నారు. కానీ విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

VIDEO

Next Story