నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివస్తున్న భక్తులు

by Ajay Maddhiboyina |

విశాఖ సింహాద్రి అప్ప‌న్న గిరి ప్ర‌ద‌క్షిణ నేడు ప్రారంభ‌మైంది. గిరిప్ర‌ద‌ర్శ‌న‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. అప్పన్న తోలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భ‌క్తులు ప్రదక్షిణకి బయలు దేరుతున్నారు.

నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ.. భారీగా తరలివస్తున్న భక్తులు
X

దిశ‌, వెబ్ డెస్క్: విశాఖ సింహాద్రి అప్ప‌న్న గిరి ప్ర‌ద‌క్షిణ నేడు ప్రారంభ‌మైంది. గిరిప్ర‌ద‌ర్శ‌న‌కు భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. అప్పన్న తోలిపావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి భ‌క్తులు ప్రదక్షిణకి బయలు దేరుతున్నారు. 32 కిలోమీటర్లు గిరి చుట్టూ తిరిగి రేపు ఉదయానికి అప్పన్న ఆలయానికి చేరుకొనున్నారు. ఈసారి 10 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారని జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసింది. దానికి త‌గిన‌ట్టుగానే సింహాచ‌లం దేవ‌స్థానం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. నేడు, రేపు భ‌క్తుల‌కు అప్ప‌న్న ఉచిత ద‌ర్శ‌నం ల‌భించ‌నుంది.

అంతేకాకుండా ఆల‌యానికి వ‌స్తున్న భ‌క్తుల కోసం ఉచిత బ‌స్సు సౌక‌ర్యం కూడా క‌ల్పించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రదక్షిణ దారిపోడవునా ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉంటే సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ ప్రతిఏడాది ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా అంత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యాత్రలో కొండచుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు భక్తులు పాదయాత్ర చేస్తారు. గిరిప్రదక్షణ చేయడం వల్ల భూప్రదక్షణ చేసినంత పుణ్యం లభిస్తుందని, పాపాలు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.

Next Story