- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాకుళంలో భారీ తిమింగలం
by Seetharam |
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు సముద్రతీరానికి భారీ తిమింగలం మృతదేహం కొట్టుకువచ్చింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలంలోని భావనపాడు సముద్రతీరానికి భారీ తిమింగలం మృతదేహం కొట్టుకువచ్చింది. శుక్రవారం ఉదయం సముద్ర వేటకు వెళ్తున్న మత్స్యకారులు ఈ మృతదేహాన్ని గమనించారు. భారీ తిమింగలం చనిపోయి ఉండటంతో దాని గురించి అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ తిమింగలం దాదాపు 15 మీటర్లు పొడవు, పది టన్నుల బరువు ఉంటుందని మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తిమింగలం సముద్రంలోనే మృతి చెంది ఒడ్డుకు చేరిందని.. దుర్వాసన రావడంతో తాము గమనించి అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లు మత్స్యకారులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీ తిమింగలం మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
Next Story






