- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లతో గౌతమ్ అదానీ భేటీ
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ.. సీఎం చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి లోకేశ్ కూడా పాల్గొన్నారు. స్పెషల్ ఫ్లైట్ లో బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయన.. నేరుగా ఉండవల్లికి వెళ్లి సీఎంతో సమవేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో పెట్టనున్న పెట్టుబడులపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
ఇటీవల విశాఖలో జరిగిన ఇన్వెస్టర్ సమ్మిట్ లో అదానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ రూ.1 లక్షకోట్ల పెట్టుబడులను ప్రకటించారు. రాబోయే పదేళ్లలో ఏపీలో లక్షకోట్ల రూపాయల పెట్టుబడులను అదానీ గ్రూప్.. పోర్టులు, సిమెంట, డేటా సెంటర్స్, ఎనర్జీ, అడ్వాన్స్ డ్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో పెడుతుందని ప్రకటించారు.






