- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయవాడలో గ్యాస్ కష్టాలు.. పొట్టు పొయ్యిపై టీ కాసి అమ్ముతున్న కేఫ్
by Vemula.Srinu Prasad |
విజయవాడలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల సంక్షోభంతో హోటల్ నిర్వహకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో గ్యాస్ కష్టాలు(Gas Problems) కొనసాగుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ల(Commercial cylinders) సంక్షోభంతో హోటల్ నిర్వహకులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కట్టెలు, పొట్లు పొయ్యిలపైనే టీ, టిఫెన్ చేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లు గ్యాస్ పొయ్యిపై వంటలు చేసి అమ్ముకున్నారు. ఇప్పుడు టీ, కాఫీ తయారు చేయాలన్నా నానా తంటాలు పడుతున్నారు. హోటల్ క్లోజ్ చేస్తే ఇబ్బందులు మరింత అవుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరగా స్పందించి గ్యాస్ సంక్షోభం నుంచి తమను గట్టెక్కించాలని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడలోని హలో చాయ్ కేఫ్ నిర్వాహకులు పడుతున్న కష్టాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ప్రజలు సైతం త్వరగా గ్యాస్ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.
Next Story






