- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో ఘనంగా గురు పౌర్ణమి గరుడసేవ
by Naga Rani Yarlagadda |
గురుపౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం టీటీడీ (TTD) గరుడవాహన సేవ (Garuda Vahanaseva) నిర్వహించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా (Guru Pournami) జరుపుకుంటారు. ఈ రోజున దుర్గాదేవిని శాకాంబరీ దేవిగా అలంకరించడంతో పాటు అన్ని దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో గురువారం టీటీడీ (TTD) గరుడవాహన సేవ (Garuda Vahanaseva) నిర్వహించింది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల సమయంలో శ్రీమలయప్పస్వామివారు (Sri Malayappa Swamy) గరుడ వాహనంపై తిరుమాఢవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహనంపై వచ్చిన స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అడుగడుగునా హారతులు పట్టి.. గోవింద నామస్మరణ చేశారు.
Next Story






