పేద బ్రాహ్మణులకు త్వరలో గరుడ పథకం అమలు

by Vemula.Srinu Prasad |

పేద బ్రాహ్మణులకు ఏపీ ప్రభుత్వం త్వరలో గరుడ పథకం అమలు చేయనుంది...

పేద బ్రాహ్మణులకు త్వరలో గరుడ పథకం అమలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం(Ap Government) త్వరలో మరో బృహత్తరమైన పథకాన్ని తీసుకురానుంది. పేదలకు ఇప్పటి వరకూ ఎన్నో సంక్షేమ పథకాలు అందించింది. తాజాగా పేద బ్రహ్మణుల(Poor Brahmins)పై దృష్టి పెట్టింది. బ్రాహ్మణులు చనిపోతే ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. పేద బ్రాహ్మణులు మృతి చెందితే రూ. 10 వేలు అందజేయాలని భావించింది. ఈ మేరకు త్వరలో గరుడ పథకానికి(Garuda Scheme) శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్లు ఆమె వెల్లడించారు.

రూ.10 వేల ఆర్థిక సాయం


అమరావతి సచివాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కె.బుచ్చిరాంప్రసాద్‌తో మంత్రి సవిత భేటీ అయి గరుడ పథకం విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదలైన బ్రాహ్మణులు మృతి చెందితే గరుడు పథకం ద్వారా రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. . ఈ ఆర్థిక సాయంతో పేద బ్రాహ్మణ కుటుంబాలకు కష్టసమయంలో ఉపశమనం లభిస్తుందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సబిత పేర్కొన్నారు.

Next Story