- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వంశీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మరికొన్ని కేసుల్లో పీటీ వారెంట్లు రెడీ..?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది..

దిశ, వెబ్ డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Gannavaram Former Mla Vallabhaneni Vamsi)కి చుట్టూ మరింతగా ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే వ్యక్తి కిడ్నాప్ కేసు(Kidnapping Case)లో అరెస్ట్ అయిన జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. ప్రస్తుతం పాత కేసులను పోలీసులు బయటకు లాగుతున్నారు. మొత్తం మూడు కేసుల్లో పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. గన్నవరం ఎలైట్ హోటల్(Gannavaram Elite Hotel) వద్ద జరిగిన దాడి, హనుమాన్ జంక్షన్(Hanuman Junction)లో షాపుల కూల్చివేత, ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన కేసులపై కృష్ణా జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. రెండు కేసుల్లో ఇప్పటికే వంశీ నిందితుడిగా ఉన్నారు. మరో కేసు కూడా నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వంశీ నిందితుడిగా ఉన్న రెండు కేసుల్లో విచారణ చేపట్టేందుకు నూజివీడు, గన్నవరం కోర్టుల్లో పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా వల్లభనేని వంశీని వ్యక్తి కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు(Vijayawada SC and ST Court)లో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వంశీకి బెయిల్ ఇవ్వద్దని పోలీసులు వాదనలు వినిపిస్తున్నారు. కిడ్నాప్ అయిన వ్యక్తి స్టేట్ మెంట్ వినేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరారు.






