తిరుమలలోని పాపవినాశనం జలాశయం వద్ద ఘనంగా గంగ హారతి

by Malleboina Mahesh |

ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తిరుపతిలో గడిచిన మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి.

తిరుమలలోని పాపవినాశనం జలాశయం వద్ద ఘనంగా గంగ హారతి
X

దిశ, వెబ్ డెస్క్: ఈశాన్య రుతుపవనాలు, బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా తిరుపతిలో గడిచిన మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో తిరుమల కొండలపై ఉన్న పాపవినాశనం జలాశయం పూర్తి స్థాయిలో నిండుకుంది. దీంతో ఈ రోజు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి పాపవినాశనం జలాశయం వద్ద గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పసుపు–కుంకుమ, పూలు, పండ్లు గంగకు నివేదించి ప్రత్యేక పూజలు చేశారు. తీర్థక్షేత్రం తిరుమలలోని నాలుగు జలాశయాలు పూర్తిగా నిండాయని, ఇంకా రెండు జలాశయాలు కొంత మేర నిండాల్సి ఉందని అధికారులు తెలిపారు.

భక్తుల అవసరాల కోసం రోజుకు 50 లక్షల గ్యాలన్ల నీటి అవసరం ఉండగా, అందులో 25 లక్షల గ్యాలన్లు కళ్యాణి జలాశయం నుండి వస్తుందని, ప్రస్తుతం తిరుమలలో 250 రోజుల నీటి అవసరాలకు సరిపడా వాటర్ స్టోరేజ్ వచ్చిందని, ఇది ఒక శుభపరిణామమని. అలాగే జలాశయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నీటి నిర్వహణను సమర్థంగా కొనసాగిస్తున్న ఇంజనీరింగ్ శాఖను అభినందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే టీటీడీ చరిత్రలో తొలిసారిగా భారీ విరాళాలు వచ్చాయని, గత 11 నెలల్లోనే ₹918 కోట్లు విరాళాలు టీటీడీ ట్రస్టులకు అందడం చారిత్రాత్మకమని ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గుర్తు చేశారు.

Next Story