- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లడ్డూ, కలశం వేలంపాట.. రికార్టుస్థాయి ధర
వినాయకచవితి నవరాత్రుల్లో జరిగే వాటిలో.. ఏ పందిరి వద్దైనా లడ్డూ వేలంపాటే హైలైట్ గా నిలుస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: వినాయకచవితి నవరాత్రుల్లో జరిగే వాటిలో.. ఏ పందిరి వద్దైనా లడ్డూ వేలంపాటే హైలైట్ గా నిలుస్తుంది. లంబోదరుడు లడ్డూ ఎంత ధర పలికింది? ఎవరు దక్కించుకున్నారు? అని ఆసక్తిగా తిలకిస్తారు. ప్రకాశం జిల్లా సిఎస్ పురం మండలంలోని అయ్యలూరివారిపల్లిలో వినాయకుడి లడ్డూ, కలశం వేలంపాటలో భారీ ధర పలకడంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
శుక్రవారం (ఆగస్టు 29) గణేషుడి నిమజ్జనం సందర్భంగా మండపం వద్ద లడ్డూ, కలశాలకు వేలంపాటలు నిర్వహించారు. లడ్డూను గ్రామానికి చెందిన పాలుగుళ్ల మోహన్ రెడ్డి రూ.30 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఆయన బెంగళూరులో వ్యాపారం చేస్తున్నారు. కలశాన్ని గ్రామానికి చెందిన, బెంగళూరులో స్థిరపడిన ముత్యాల నారాయణరెడ్డి రూ.19.10 లక్షలకు దక్కించుకున్నారు. ప్రతీ ఏటా ఈ ఊరిలో వినాయకుడి లడ్డూ, కలశం వేలం లక్షల్లో పలుకుతుండగా.. ఈ ఏడాది భారీ ధర పలకడం విశేషమంటున్నారు గ్రామస్థులు. ఈ డబ్బును ఊరి అభివృద్ధికి, ఉత్సవాలకు వినియోగించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.






